Friday, March 1, 2019

గోపాల శివ ద్వార "అభినవ శూరుడా" కవిత


గోపాల శివ S/O గోపాల మల్లయ్య , రేమద్దుల SSC -2005-2006 బ్యాచ్ , 'అభినవ శూరుడా ' అంటూ పాకిస్తాన్ అదుపులో ఉండి ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ను తలుచుకుంటూ రాసిన కవిత.

All the best Shiva. ముందు ముందు ఇంకా పైకి ఎదగాలని మరియు మంచి కవితలు రాయాలని ఆశిస్తున్నాము.

ప్రస్తుతం గోపాల శివ 99 టీవి హైదరాబాద్ హెడ్ ఆఫీసులో వీడియో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
అభినవ శూరుడా !

వీరుడా అభినవ శూరుడా..
తోడేళ్ళ మందకు ఆహారం
అవుతున్నావని తెలిసినా
అదరక బెదరక తలవంచక
సింహమై గర్జించిన నీ ధీరత్వానికి
యావత్ భారతం సలాం కొడుతోంది..
రాబందుల రాజ్యంలో
ఆ రాకాసుల చేతుల్లో
ముఖమంతా రుధిరంతో
బతుకును పణంగా పెట్టి
జైహింద్ అన్న నీ పరాక్రమానికి
అశేతు హిమాచలం
మంచు వర్షం కురిపిస్తోంది

భారతమ్మ బిడ్డల నుదుట
సింధూరాన్ని తుడిపేసిన
విషనాగుల చెరలో నీవున్నా

మొక్కవోని ధైర్య సాహసంతో
సవాల్ విసిరిన నీ పరాక్రమం
120 కోట్ల అభిమానుల
గుండె చప్పుడై మారుమోగుతోంది.

సింహం ఎక్కడున్నా సింహమేరా
ఈ కళ్ళల్లో మండుతున్న అగ్ని ధాటికి
మీ అరాచక శక్తులు బూడిద కాక తప్పదురా..

శత్రువులకు దడపుట్టించి
మాతృభూమికి తిరిగివస్తున్న
వీరుడా వందనం..
ధీరుడా అభివందనం...🙏
జై హింద్ జై జవాన్ జై జై జవాన్

No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి