Tuesday, March 26, 2019

మార్చ్ 23 న, స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురు దేశం కోసం అమరులైన రోజున, రేమద్దుల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అమరవీరుల దినం జరుపుకోవడం జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా SI రాములు, భగత్ మరియు భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగినది.










మార్చ్ 23 న, సిపీఎం పార్టీ యువ నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పుష్పగుచ్ఛము వేసి జోహార్లు అర్పించారు.












Monday, March 25, 2019


అర్హతలు
2019 మార్చిలో 10 తరగతి పబ్లిక్పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు. ఇంటర్విభాగాలు ఎంపిసి, బైపిసి, ఎంఇసి, సిఇసి
కాలేజీలసంఖ్య
35, ఇందులో బాలురు-15, బాలికలు-20
ఫీజువివరాలు
రూ.150/-
ఎంపిక విధానం
ఆబ్జెక్టివ్ప్రవేశపరీక్ష ద్వారా, ప్రవేశ పరీక్షలో 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఎంపిసికి ఇంగ్లీష్‌, మాథ్స్‌, ఫిజికల్సైన్స్‌, బైపిసికి ఇంగ్లీష్‌, బయోసైన్స్‌, ఫిజికల్సైన్స్‌. సిఇసి, ఎంఇసి, గ్రూప్కు ఇంగ్లీష్‌, మాథ్స్‌, సోషల్స్టడీస్‌, అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రవేశపరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్కాలేజీల్లో చేరినవారికి అదనంగా కామన్ఎంట్రెన్స్‌, టెస్టులైన ఎంసెట్‌, నీట్ఐఐటి జెఇఇ కోచింగ్ఇస్తారు.
ప్రవేశపరీక్ష
10- మే-2019
దరఖాస్తులకు ఆఖరుతేదీ
11- ఏప్రిల్‌-2019
వెబ్‌సైట్‌

Friday, March 22, 2019

భారత బానిస సంకెళ్లు విడిపించేందుకు
బ్రిటీషర్ల ఉరికొయ్యలకు ఊపిరి వదిలిన
అమర వీరులకు జోహార్లు!
1). Bhagat Singh ( Died@23 years)
2). Sukhdev Thapar (Died @23 years)
3). Shivaram Rajguru (Died @22 years)



Saturday, March 9, 2019


విజయ్ ఆత్మకూరి S/O కోదండ రాములు, రేమద్దుల SSC -2001-2002 బ్యాచ్ , 'పరువు హత్యలెందుకు? ' అంటూ సమాజంలో పరువు హత్యలెందుకు జరుగుతున్నాయి అంటూ ప్రశ్నిస్తూ, అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల చిత్ర పటాలకు దండలు వేయడమే కాదు వారి ఆశయాలకు అణువుగా నడుచుకోవాలని ఆర్టికల్ రాశాడు.

ప్రస్తుతం విజయ్ ఆత్మకూరి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(TTWURJC (PTG-B))- మన్ననూర్ పనిచేస్తున్నాడు.

Thursday, March 7, 2019

రానున్న విద్య సంవత్సరానికి 2019-20 లో 5, 6, 7, 8వ తరగతులలో ప్రవేశానికి గాను రాష్ట్ర మైనారిటీ శాఖ అధికారులు  అర్హులైన విధ్యార్ధులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కావున మన ఊరి(రేమద్దుల) నుండి ఎవరైనా ఉంటె, ఈ అవకాశాన్ని వినియోగించు కుంటారని website లో పోస్ట్ చేయడం జరుగుతున్నది.

విద్యా సంవత్సరం : 2019-20

అర్హులు: మైనారిటి విద్యార్థులతో పాటు SC, ST, BC మరియు OC విద్యార్థులకు రిజర్వేషన్స్ ప్రకారం

దరఖాస్తు చివరి తేదీ: 31.03.2019

పరీక్ష తేదీ: 20-ఏప్రిల్-2019 -  5 వ తరగతి
                    22-ఏప్రిల్-2019 -  6వ, 7వ, 8వ  తరగతులు

ఎక్కడ అప్లై చెయ్యాలి: http://tmreis.telangana.gov.in/

Credits to
www.epaper.eenadu.net.

మన ఉరిలో(రేమద్దుల) రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించబడ్డాయి. మన ఊరి సర్పంచ్ మంజుల తిరుపతయ్య ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాలనుండి 11 ఎద్దుల జతలు పోటీలో పాల్గొన్నాయి. 

జరిగిన రోజు : 05.03.2019

గెలిచిన  వారి వివరాలు
మొదటి స్థానం : చక్రవర్తి గౌడ్ ఎద్దులు - శనగపల్లి, ఇటిక్యాల 
రెండవ స్థానం: వీరేష్ గౌడ్ - ఇందువాసి, గట్టు 
మూడవ స్థానం : వెంకటేశ్వరరావు - చంద్రకల్ , పెద్దకొత్తపల్లి 
నాల్గవ స్థానం : లింగాల స్వామి - అంబటి పల్లి 
అయిదవ స్థానం: రామచంద్ర రెడ్డి - రాయవరం 

ఫొటోలు








వీడియోలు 





వార్తా క్లిప్పింగ్స్ 





Monday, March 4, 2019

May Lord Shiva give power and strength to everyone facing difficulties.
Wishing you and your family Maha Shivaratri.


Friday, March 1, 2019


గోపాల శివ S/O గోపాల మల్లయ్య , రేమద్దుల SSC -2005-2006 బ్యాచ్ , 'అభినవ శూరుడా ' అంటూ పాకిస్తాన్ అదుపులో ఉండి ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ను తలుచుకుంటూ రాసిన కవిత.

All the best Shiva. ముందు ముందు ఇంకా పైకి ఎదగాలని మరియు మంచి కవితలు రాయాలని ఆశిస్తున్నాము.

ప్రస్తుతం గోపాల శివ 99 టీవి హైదరాబాద్ హెడ్ ఆఫీసులో వీడియో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
అభినవ శూరుడా !

వీరుడా అభినవ శూరుడా..
తోడేళ్ళ మందకు ఆహారం
అవుతున్నావని తెలిసినా
అదరక బెదరక తలవంచక
సింహమై గర్జించిన నీ ధీరత్వానికి
యావత్ భారతం సలాం కొడుతోంది..
రాబందుల రాజ్యంలో
ఆ రాకాసుల చేతుల్లో
ముఖమంతా రుధిరంతో
బతుకును పణంగా పెట్టి
జైహింద్ అన్న నీ పరాక్రమానికి
అశేతు హిమాచలం
మంచు వర్షం కురిపిస్తోంది

భారతమ్మ బిడ్డల నుదుట
సింధూరాన్ని తుడిపేసిన
విషనాగుల చెరలో నీవున్నా

మొక్కవోని ధైర్య సాహసంతో
సవాల్ విసిరిన నీ పరాక్రమం
120 కోట్ల అభిమానుల
గుండె చప్పుడై మారుమోగుతోంది.

సింహం ఎక్కడున్నా సింహమేరా
ఈ కళ్ళల్లో మండుతున్న అగ్ని ధాటికి
మీ అరాచక శక్తులు బూడిద కాక తప్పదురా..

శత్రువులకు దడపుట్టించి
మాతృభూమికి తిరిగివస్తున్న
వీరుడా వందనం..
ధీరుడా అభివందనం...🙏
జై హింద్ జై జవాన్ జై జై జవాన్