Saturday, February 16, 2019

గ్రామ సభ - MGNREGS -100 పని దినములు కనీస వేతనం క్రింద చేయవలిసిన పనులు చర్చిండం కొరకు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం(

MGNREGS)

 క్రింద ఈ సంవత్సరం(2019) 100 పని దినములలో చేయించవల్సిన పనుల గురించి చర్చించడానికి  సర్పంచ్ మంజుల(మరియు భర్త తిరుపతయ్య) గారు అందుబాటులో ఉన్న వార్డ్ మెంబెర్స్ ని, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీలత గారిని, ఎంపీటీసీ వేణు గోపాల్ గారిని మరియు ఇతర ఊరి పెద్దలను పిలవడం జరిగింది. 

సమావేశం జరిగిన రోజు : 14.02.2019





ఈ సమావేశంలో క్రింద ఇచ్చిన పనులు చేయాలని నిర్ణయించడం జరిగినది. 

1. చెరువులలో ఒండ్రు మట్టి తీయడం 
2. పశువుల షెడ్ నిర్మాణం 
3. పొలాలలో కల్లములు తయారు చేయడం 
4. గట్టులనుండి నుండి వచ్చే వాగులను లింక్ చేయడం 
5. లోకల్ బావులను పూడ్చివేయుట
6. కోనేరు ని అభివృధి చేయడం 
7.  రైతుల బావుల పూడికతీత
8.  కట్వాల వాగు శుభ్రం చేయడం 
9.  పొలాలను లెవెలింగ్ చేయడం 
10.  పొలాలలో కందకాలు తీయడం 
11. ఊటకుంటల నిర్మాణం 
12. రైతుల పొలాలకు బాటలు వేయడం 

ఈ సమావేశానికి హాజరైన వార్డ్ మెంబర్లు. మిగితా వాళ్ళు హాజరు కాలేక పోయారు. 
2. గొంది లక్మమ్మ భర్త రామేశ్వర్ రెడ్డి 
5. మహంకాళి హన్మంత్ 
6. మోటూరి శివయ్య 
7. గంధం రాంబాబు 
8. కావలి బాలనాగమ్మ భర్త బాలకృష్ణ 
9. గొల్లకుంట రాములమ్మ భర్త రాములు

ఏ పంచాయతీ అయినా గ్రామసభ నిర్వహిస్తేనే ఆ పల్లెల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. గ్రామసభ ఏర్పాటుకు 500లోపు ఓటర్లు ఉంటే 50 మంది హాజరుకావాలి. వెయ్యిలోపు ఓటర్లు ఉంటే 75 మంది హాజరుకావాలి. మూడు వేలలోపు ఓటర్లు ఉంటే 150, ఐదువేల లోపు ఓటర్లు ఉంటే 200 హాజరుకావాలి. పదివేల లోపు ఉంటే 300, పదివేలకు పైగా ఉంటే 400 మంది గ్రామసభకు హాజరైతే ఆ సభకు కోరం పూర్తిగా ఉన్నట్లు.



సూచన ఏమంటే గ్రామ సభలకు పైన ఇచ్చినట్లు జన సమీకరణ చేయవలిసి ఉంటుంది. అన్ని వార్డులనుండి జన సమీకరణ జరగాలి. 12 మంది కూర్చుంటే సమస్యలు తెలియవు.  


No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి