Wednesday, February 6, 2019

Kotha Panchayati Raj chattam-2018


పంచాయతీ రాజ్ చట్టం - 2018💐లో ముఖ్యమైన అంశాలు  :-

సర్పంచ్ విధులు  :-

1) గ్రామ అభివృద్ధి, నిధుల వినియోగం

2) మొక్కలు నాటడం

3) పారిశుద్ధ్య పనులు నిర్వహించడం

4) గ్రామ ప్రజలందరికీ మరుగుదొడ్లు ఏర్పాటు

5) చెత్త, చెదారాన్ని రోడ్లపై వేస్తే 500/- జరిమానా విధించే అధికారం పాలక వర్గానికి కల్పించారు

కోరం ఏర్పాటు:-
500 ఓటర్లుంటే                   --  50   మందితో
500 -  1000  ఓటర్లుంటే     --  75   మందితో
1000 - 3000 ఓటర్లుంటే     --  150 మందితో
3000 - 5000 ఓటర్లుంటే.    --  200 మందితో
5000 - 10000 ఓటర్లుంటే   --  300 మందితో
10000 పైబడి ఓటర్లుంటే.    --  400 మందితో

కోరం ఏర్పాటు చేయాలి మరియు గ్రామ సభకు హజరు కావాలి

కో ఆప్షన్ సభ్యులు :- ముగ్గురు (3):-

1) రిటైర్డ్ ఎంప్లాయి లేదా సీనియర్ సిటిజన్

2) గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాలు(వి.ఒ)

3) ఎన్.ఆర్.ఐ.,  ప్రముఖులు ( విరాళం ఇచ్చే)

వీరు గ్రామ అభివృద్ధిలో సలహలు , సూచనలు ఇవ్వాలి

స్టాండింగ్ కమిటీ:-  సెక్షన్ 49 ప్రకారం 4 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి.

1) పారిశుద్ధ్యం , డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం

2) వీధి దీపాల ఏర్పాటు కొరకు

3) హరితహారం, మొక్కలు పెంపకం.

4) అభివృద్ధి పనుల కొరకు

నియమ , నిబంధనలు :-

1) పాలకవర్గానికి పూర్తి స్థాయి అధికారంతొ పాటు సర్పంచ్ కు పూర్తి కార్య నిర్వాహణ అధికారం కల్పించారు. ఉప సర్పంచ్ కి కూడా "చెక్" పవర్ కల్పించారు

2) విధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పాలక వర్గాన్ని రద్దు చేసి సర్పంచ్ ను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్ కు కలదు.

3) వరుసగా మూడు సార్లు గ్రామ సభల నిర్వహనలో విఫలమైతే సర్పంచ్ ని విధులనుండి తొలగిస్తారు

4) చట్టాన్ని ధిక్కరించినా,.ఆడిటింగ్ నిర్వహణలో విఫలమైనా , నిధులు దుర్వినియోగం చేసినా జిల్లా కలెక్టర్ - సర్పంచ్ ను తొలగిస్తారు

5) ఈవిధంగా తొలగించబడినవారు "ట్రిబ్యునల్" ను ఆశ్రయించవచ్చు , స్టే ఇచ్చే అధికారం ట్రిబ్యునల్ కు కలదు.

6) ప్రతి రెండు నెలలకొకసారి గ్రామ సభను నిర్వహించాలి , ఏడాదిలో ఒకసారైనా వ్రృద్దులు , మహిళలు , వికలాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి.

7) గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ప్రతి నెల "పాలకవర్గ" సమావేశం ఏర్పాటు చేయాలి.

8)  ప్రతి మూడు నెలలకొకసారి పంచాయతీ విస్తరణ అధికారి(ఈవోపిఆర్డీ) ప్రతి పంచాయతీని తనిఖీ చేయాలి. ప్రతి నెల 5 పంచాయతీల పర్యవేక్షణ, అభివృద్ధి కార్యక్రమాలపై విచారణ చేయాలి.

9) గ్రామ సభను పూర్తిగా వీడియో, ఫోటోలు తీసి సమర్పించాలి. ఈ సభకు అన్ని విభాగాల అధికారులు , సిబ్బంది హజరు కావాలి.

10) రాష్ట్ర బడ్జెట్లోనే నేరుగా నిధుల కేటాయింపు, 14వ ఆర్థిక సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఏక మొత్తంగా కేటాయింపు, జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామ పంచాయతీ కి కనీసం 5 లక్షల రూపాయలు ఏటా రాష్ట్ర బడ్జెట్ నుండే నేరుగా కేటాయింపు.

11) గ్రామ రోడ్లను పంచాయతీ రాజ్ శాఖ నిర్మాణం చేస్తుంది.

12) మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ నీటిని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుంది.

No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి