Tuesday, February 19, 2019

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురుంచి


PM-KISAN Scheme
చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-KISAN)’ పథకం పెట్టి 2019 నుండి నగదు సహాయం చేయాలని నిర్ణయించింది. PM-KISAN పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

పథకం ఎవరికీ వర్తిస్తుంది?
ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఐదెకరాల లోపు భూమిని వివిధ చోట్ల ఉండి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటున్నా వారికి కూడా అందజేస్తారు.

పతకం క్రింద ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?
ఏటా మూడు విడతలు రెండు వేల రూపాయల వంతున సంవత్సరానికి 6000 రూ. ఆర్థిక సహాయం అందుతుంది.

ఆర్థిక సహాయం ఎప్పుడు చేస్తారు?
మొదటి విడత కాలం 1.12.2018 to 31.03.2019 కి గాను  24.02.2019 రోజు బ్యాంకు అకౌంట్ లో 2000 రూ. వేస్తారు.
మొదటి విడతకు చివరి తేదీ: 20.02.2019

పథకం ఎవరికి వర్తించదు?
క్రింద ఇచ్చిన అధిక ఆర్థిక స్థితి వర్గాలకు ఈ పథకం వర్తించదు
  1. ఉన్నతాదాయవర్గాల వారు
  2. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థల కింద ఐదెకరాల లోపు భూమి ఉన్నవారు
  3. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వర్తించదు
  4. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ తాజా, మాజీ చైర్మన్లు
  5. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు. నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపు.
  6. రూ.10వేల మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులు, గతేడాది ఐటీ చెల్లించినవారు.
లబ్దిదారులను ఎలా  గుర్తిస్తారు?
  1. రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఉన్న అర్హత గల లబ్ధిదారుల కుటుంబాలను గుర్తించాలి.  లబ్ధిదారుల డాటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం పేరు, వయస్సు, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఆధార్, సెల్‌నంబర్లు కూడా పంపాలి.
  2. లబ్ధిదారులే సొంత ధ్రువీకరణ ఇవ్వాలి. తప్పుడు సమాచారమిస్తే సొమ్ము వాపస్ తీసుకోవటంతోపాటు చట్టపర చర్యలు.
  3. రాష్ట్రాలు లబ్దిదారులను గుర్తించడానికి ముందున్న భూ-యాజమాన్య వ్యవస్థని ఉపయోగించుకోవాలి.  వాటిని ఆధార్ తో అనుసంధానం చేయాలి  మరియు భూమి రికార్డులను డిజిటైజషన్ చేయాలి. 
  4. అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలు గ్రామ పంచాయితీలో ప్రచురించాలి. 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరియు రైతు బంధు రెండు ఒకటి కాదు.

Website
https://pmkisan.nic.in/Home.aspx

PM-KISAN - OPERATIONAL GUIDELINES




PM-KISAN గురుంచి ఈనాడు పేపర్లో (19.02.2019)

CREDITS to: www.epaper.eenadu.net



No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి