Wednesday, February 27, 2019

ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా తీసిన ఫోటోలు.

స్వయం పరిపాలన దినోత్సవం జరిగిన రోజు : 26.02.2019





Monday, February 25, 2019

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని ఉట్కూరి మండలం, బిజ్వార్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి నిరూపించాడు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికెషన్స్కు అప్లై చేసుకొని ప్రణాళిక ప్రకారం చదివి ఒకేసారి అయిదు ఉద్యోగాలకు ఎంపికైనాడు.

ప్రేరణకు ప్రతి ఒక్కరికి అబ్దుల్ కలాం జీవితమే కావలిసిన అవసరం లేదు. మీ చుట్టు పక్కల కూడా ఎన్నో ప్రేరణాత్మక కథలు ఉంటాయి.

మన ఊరినుండి కూడా ఇలాంటి ప్రేరేపింప దగిన కథలు ఉంటె, remaddula.info@gmail.com లేదా 7995391030 కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు


CREDITS to: www.epaper.eenadu.net



Thursday, February 21, 2019

స్వచ్ఛ రేమద్దుల!               స్వచ్ఛ భారత్!!











మన గ్రామంలో మురికి నీరు రోడ్ల పై పారుతుంది అదేవిదంగా చెత్త చెదారం రోడ్లపై గ్రామ ప్రజలు వేస్తున్నారు కాబట్టి ఆలా వేయడం వలన మన ప్రజలే ఆనారోగ్య పాలై అవకాశం ఉంది కాబట్టి ప్రజల దృష్టికి తీసుకపోదాం అందుకోసం మనం అందరం ఆదివారం రోజు డ్రైనేజీ ల మట్టి ఎత్తడం ప్రోగ్రాం పెట్టుకుందాం కాబట్టి అందరు తప్పకుండా పాల్గొనగలరు మన ఊరి శుభ్రతకు యువత ముందుకు రావాలి.

సర్పంచ్ మంజుల తిరుపతయ్య 

ఉపసర్పంచ్ గంధం రాంబాబు

Tuesday, February 19, 2019


PM-KISAN Scheme
చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-KISAN)’ పథకం పెట్టి 2019 నుండి నగదు సహాయం చేయాలని నిర్ణయించింది. PM-KISAN పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

పథకం ఎవరికీ వర్తిస్తుంది?
ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఐదెకరాల లోపు భూమిని వివిధ చోట్ల ఉండి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటున్నా వారికి కూడా అందజేస్తారు.

పతకం క్రింద ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?
ఏటా మూడు విడతలు రెండు వేల రూపాయల వంతున సంవత్సరానికి 6000 రూ. ఆర్థిక సహాయం అందుతుంది.

ఆర్థిక సహాయం ఎప్పుడు చేస్తారు?
మొదటి విడత కాలం 1.12.2018 to 31.03.2019 కి గాను  24.02.2019 రోజు బ్యాంకు అకౌంట్ లో 2000 రూ. వేస్తారు.
మొదటి విడతకు చివరి తేదీ: 20.02.2019

పథకం ఎవరికి వర్తించదు?
క్రింద ఇచ్చిన అధిక ఆర్థిక స్థితి వర్గాలకు ఈ పథకం వర్తించదు
  1. ఉన్నతాదాయవర్గాల వారు
  2. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థల కింద ఐదెకరాల లోపు భూమి ఉన్నవారు
  3. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వర్తించదు
  4. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ తాజా, మాజీ చైర్మన్లు
  5. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు. నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపు.
  6. రూ.10వేల మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులు, గతేడాది ఐటీ చెల్లించినవారు.
లబ్దిదారులను ఎలా  గుర్తిస్తారు?
  1. రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఉన్న అర్హత గల లబ్ధిదారుల కుటుంబాలను గుర్తించాలి.  లబ్ధిదారుల డాటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం పేరు, వయస్సు, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఆధార్, సెల్‌నంబర్లు కూడా పంపాలి.
  2. లబ్ధిదారులే సొంత ధ్రువీకరణ ఇవ్వాలి. తప్పుడు సమాచారమిస్తే సొమ్ము వాపస్ తీసుకోవటంతోపాటు చట్టపర చర్యలు.
  3. రాష్ట్రాలు లబ్దిదారులను గుర్తించడానికి ముందున్న భూ-యాజమాన్య వ్యవస్థని ఉపయోగించుకోవాలి.  వాటిని ఆధార్ తో అనుసంధానం చేయాలి  మరియు భూమి రికార్డులను డిజిటైజషన్ చేయాలి. 
  4. అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలు గ్రామ పంచాయితీలో ప్రచురించాలి. 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరియు రైతు బంధు రెండు ఒకటి కాదు.

Website
https://pmkisan.nic.in/Home.aspx

PM-KISAN - OPERATIONAL GUIDELINES




PM-KISAN గురుంచి ఈనాడు పేపర్లో (19.02.2019)

CREDITS to: www.epaper.eenadu.net



Monday, February 18, 2019

రేమద్దుల గ్రామ ఉన్నత పాఠశాలలో 16.02.2019 ( శనివారము ) రోజు, "ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(PMGDISHA)" పథకం క్రింద డిజిటల్ అక్షరాస్యతను కల్పించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగినవి. దీనిని "డిజిటల్ ఇండియా ప్రోగ్రాము"లో భాగంగా చేపట్టనున్నారు.

దీనిలో భాగంగా రేమద్దుల గ్రామంకు చెంది డిగ్రీ చేసిన ఒక 10 మంది నిరుద్యోగ యువతకు డిజిటల్ ట్రైనింగ్ ఇప్పించి తద్వార వారిని విద్య వాలంటీర్స్ గా తీసుకొని హై స్కూల్లో ని 8 వ, 9 వ మరియు 10 వ తరగతి విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించాలని సర్పంచ్ అనుకుంటున్నారు.













రేమద్దుల ఉపసర్పంచ్ గా 7 వార్డ్ కి గెలిచిన గంధం రాంబాబు S/O బిచ్చన్న గారి చేత ఈ రోజు 18.02.2019 (సోమవారం) ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ప్రమాణ స్వీకారం చేయించారు.



ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఉప సర్పంచిగా ధ్రువపరుస్తూ ఉపసర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని పత్రాన్ని అందచేయడం జరిగినది. ఈ సమావేశానికి సర్పంచ్ మోటూరి మంజుల గారు హాజరు అయ్యారు.

CREDITS to: https://www.epaper.sakshi.com



Sunday, February 17, 2019

రాష్ట్రంలోని గురుకుల స్కూల్లలో 2019-20 ఏడాదికిగాను అడ్మిషన్ ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్.  5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజు : 17:02.2019

    CREDITS to : https://epaper.sakshi.com/



సన్నొజు రఘవర్దన్, రేమద్దుల  SSC -1995 బ్యాచ్ , 'వీర కిశోరమా ' అంటూ సదా జాతిని రక్షించే వీర జవానులకు ఓ కవిత ద్వారా అక్షరహారతి పట్టారు. 

ప్రస్తుతం రఘు తెలుగు పండితుడుగా మహబూబ్ నగర్ జిల్లా, వెన్నచేడ్ ఆదర్శ్ పాఠశాల లో పనిచేయు చున్నాడు.


Saturday, February 16, 2019

మన జవానులకు కులాలు, మతాలు మరియు వర్గాలు తెలియదు తెలిసింది ఒక్కటే భారతదేశం కోసం ప్రాణమివ్వడం. వారు మన కుటుంబాలను కాపాడడానికి అమరులైనారు. మనం మన సైనికుల కుటుంబాలకు బాసటగా నిలబడాలి.

మనం ఎంత సహాయం చేసిన అమరులైన జవానుల జీవితంకు సరితూగదు కానీ మన వంతు సహాయం చేయగలగాలి. నేను నా వంతు సహాయం చేసాను. మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి.

మనం, రేమద్దుల పౌరులం అందరం కలిసి మన కొరకు అమరులైన మన జవానుల కుటుంబాలకు దోహదపడుదాము.

ఈ లింక్ క్లిక్ చేసి డొనేట్ చేయగలరు https://bharatkeveer.gov.in/

రేమద్దుల పౌరులందరికీ చేరేలా ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి. మీరు డొనేషన్ సర్టిఫికెట్ ని క్రింద ఇచ్చిన అప్షన్స్ లో ఎక్కడైనా update చేయగలరు.  అన్ని క్రోడీకరించి ఈ పోస్ట్ లో update చేస్తాను.

remaddula.info@gmail.com కి మెయిల్ చెయ్యండి లేదా  
https://www.facebook.com/remaddula.org పేజీలో update చెయ్యండి లేదా 
https://www.twitter.com/remaddula_org అకౌంట్ కి update చెయ్యండి లేదా   
7995391030 కి whatsapp మెసేజ్ చేయగలరు. 



  • Venkat




  • Gopal Reddy


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం(

MGNREGS)

 క్రింద ఈ సంవత్సరం(2019) 100 పని దినములలో చేయించవల్సిన పనుల గురించి చర్చించడానికి  సర్పంచ్ మంజుల(మరియు భర్త తిరుపతయ్య) గారు అందుబాటులో ఉన్న వార్డ్ మెంబెర్స్ ని, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీలత గారిని, ఎంపీటీసీ వేణు గోపాల్ గారిని మరియు ఇతర ఊరి పెద్దలను పిలవడం జరిగింది. 

సమావేశం జరిగిన రోజు : 14.02.2019





ఈ సమావేశంలో క్రింద ఇచ్చిన పనులు చేయాలని నిర్ణయించడం జరిగినది. 

1. చెరువులలో ఒండ్రు మట్టి తీయడం 
2. పశువుల షెడ్ నిర్మాణం 
3. పొలాలలో కల్లములు తయారు చేయడం 
4. గట్టులనుండి నుండి వచ్చే వాగులను లింక్ చేయడం 
5. లోకల్ బావులను పూడ్చివేయుట
6. కోనేరు ని అభివృధి చేయడం 
7.  రైతుల బావుల పూడికతీత
8.  కట్వాల వాగు శుభ్రం చేయడం 
9.  పొలాలను లెవెలింగ్ చేయడం 
10.  పొలాలలో కందకాలు తీయడం 
11. ఊటకుంటల నిర్మాణం 
12. రైతుల పొలాలకు బాటలు వేయడం 

ఈ సమావేశానికి హాజరైన వార్డ్ మెంబర్లు. మిగితా వాళ్ళు హాజరు కాలేక పోయారు. 
2. గొంది లక్మమ్మ భర్త రామేశ్వర్ రెడ్డి 
5. మహంకాళి హన్మంత్ 
6. మోటూరి శివయ్య 
7. గంధం రాంబాబు 
8. కావలి బాలనాగమ్మ భర్త బాలకృష్ణ 
9. గొల్లకుంట రాములమ్మ భర్త రాములు

ఏ పంచాయతీ అయినా గ్రామసభ నిర్వహిస్తేనే ఆ పల్లెల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. గ్రామసభ ఏర్పాటుకు 500లోపు ఓటర్లు ఉంటే 50 మంది హాజరుకావాలి. వెయ్యిలోపు ఓటర్లు ఉంటే 75 మంది హాజరుకావాలి. మూడు వేలలోపు ఓటర్లు ఉంటే 150, ఐదువేల లోపు ఓటర్లు ఉంటే 200 హాజరుకావాలి. పదివేల లోపు ఉంటే 300, పదివేలకు పైగా ఉంటే 400 మంది గ్రామసభకు హాజరైతే ఆ సభకు కోరం పూర్తిగా ఉన్నట్లు.



సూచన ఏమంటే గ్రామ సభలకు పైన ఇచ్చినట్లు జన సమీకరణ చేయవలిసి ఉంటుంది. అన్ని వార్డులనుండి జన సమీకరణ జరగాలి. 12 మంది కూర్చుంటే సమస్యలు తెలియవు.  


Thursday, February 14, 2019

Pulwama లో జరిగిన దాడి గురుంచి వింటుంటే, చూస్తుంటే, చదువుతుంటే చాలా బాధ మరియు కోపం వస్తుంది. 49 మంది  CRPF జవాన్లు అమరులయినారు. ఎప్పుడు ఎదో పేరుతొ దాక్కొని దాడులు చేసే పిరికి పందలను ఎదో చేయాలని కొన్ని లక్షల ఆలోచనలు నా మదిలో మెదులుతున్నాయి. అందులోని  బలమైన ఆలోచనతో భారత ప్రభుత్వం వారికి బుద్ధిచెబుతారు అని నేను కోరుకుంటున్నాను.  గాయపడినవారు జవానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. 

అమరులైన నా వీరజవానులు అందరి ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుతూ... సెల్యూట్ చేస్తూన్న. 

వందేమాతరం !
జై హింద్ !


SOURCES:
https://twitter.com/sudarsansand/status/1096150264535379968
CREDIT to
https://twitter.com/sudarsansand



జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేమద్దుల గ్రామంలో బుధవారం రోజు విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం జ‌రుపుకున్నారు. ఈ కార్యక్ర‌మంలో భాగంగా విద్యార్థులు స్వయంగా పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మోటూరి మంజుల గారు మరియు ఆమె భర్త మోటూరి తిరుపతయ్య గారు ముఖ్య అతిధులుగా హాజరయినారు.విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని లత గారు , సర్పంచి మోటూరి మంజుల గారు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచి గెలిచిన వారికీ శుభకాంక్షలు తెలియజేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు లత గారు మాట్లాడుతూ, స్కూల్ కొత్త భవనానికి నిధులు మరియు ఇంగ్లీష్ మీడియం గురుంచి విద్యా వాలంటీర్స్ ఏర్పాటు చేయడానికి సహకరించవలిసిందిగా సర్పంచిని కోరడం జరిగింది.

పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు అందరు కలిసి నూతన సర్పంచిని శాలువ  మరియు పూలమాలతో సత్కరించారు.

స్వయం పరిపాలన దినోత్సవం జరిగిన రోజు: 13.02.2019
10th class batch : 2018-19














Tuesday, February 12, 2019

రేమద్దుల నూతన సర్పంచిగా మోటూరి మంజుల తిరుపతయ్య గారు 02.02.2019 నాడు ప్రమాణస్వీకారం చేయడమం జరిగినది. సర్పంచితో పాటు గెలిచిన వార్డు మెంబర్స్ కూడా ప్రమాణం చేయడం జరిగినది.

ప్రమాణ స్వీకారం జరిగిన రోజు : 02.02.2019













Monday, February 11, 2019

పాఠశాల, కళాశాల సమయంలో అదనపు బస్సు నడపాలని కోరుతూ సోమవారం రేమద్దుల గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగినది. చాలా మంది విద్యార్థులు ఉండడం వలన ఒక ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు సకాలంలో కళాశాల, పాఠశాలకు వెళ్లగలుతారు.

యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎద్దుల రవీందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు విద్యార్థుల కొరకు ధర్నా నిర్వహించినందుకు.

రేమద్దుల పెద్దలు మరియు యువకులు ఈ విషయం ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మీ సలహాలు తెలుపగలరు.

ధర్నా జరిగిన రోజు : 11.02 2019

Sources :
https://epaper.sakshi.com

Sunday, February 10, 2019

రేమద్దుల గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోటూరి మంజుల గారు బిజెపి మద్దతుతో  విజయం సాధించారు. సి.పి.ఎం. పార్టీ అభ్యర్థి గుంటి పద్మ గారి పై 314 ఓట్ల అధిక్యం తో విజయం సాధించారు.

పోలింగ్ తేదీ : 30.01. 2019


తెరాస అభ్యర్థి మోటూరి మంజుల

Wednesday, February 6, 2019


పంచాయతీ రాజ్ చట్టం - 2018💐లో ముఖ్యమైన అంశాలు  :-

సర్పంచ్ విధులు  :-

1) గ్రామ అభివృద్ధి, నిధుల వినియోగం

2) మొక్కలు నాటడం

3) పారిశుద్ధ్య పనులు నిర్వహించడం

4) గ్రామ ప్రజలందరికీ మరుగుదొడ్లు ఏర్పాటు

5) చెత్త, చెదారాన్ని రోడ్లపై వేస్తే 500/- జరిమానా విధించే అధికారం పాలక వర్గానికి కల్పించారు

కోరం ఏర్పాటు:-
500 ఓటర్లుంటే                   --  50   మందితో
500 -  1000  ఓటర్లుంటే     --  75   మందితో
1000 - 3000 ఓటర్లుంటే     --  150 మందితో
3000 - 5000 ఓటర్లుంటే.    --  200 మందితో
5000 - 10000 ఓటర్లుంటే   --  300 మందితో
10000 పైబడి ఓటర్లుంటే.    --  400 మందితో

కోరం ఏర్పాటు చేయాలి మరియు గ్రామ సభకు హజరు కావాలి

కో ఆప్షన్ సభ్యులు :- ముగ్గురు (3):-

1) రిటైర్డ్ ఎంప్లాయి లేదా సీనియర్ సిటిజన్

2) గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాలు(వి.ఒ)

3) ఎన్.ఆర్.ఐ.,  ప్రముఖులు ( విరాళం ఇచ్చే)

వీరు గ్రామ అభివృద్ధిలో సలహలు , సూచనలు ఇవ్వాలి

స్టాండింగ్ కమిటీ:-  సెక్షన్ 49 ప్రకారం 4 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి.

1) పారిశుద్ధ్యం , డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం

2) వీధి దీపాల ఏర్పాటు కొరకు

3) హరితహారం, మొక్కలు పెంపకం.

4) అభివృద్ధి పనుల కొరకు

నియమ , నిబంధనలు :-

1) పాలకవర్గానికి పూర్తి స్థాయి అధికారంతొ పాటు సర్పంచ్ కు పూర్తి కార్య నిర్వాహణ అధికారం కల్పించారు. ఉప సర్పంచ్ కి కూడా "చెక్" పవర్ కల్పించారు

2) విధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పాలక వర్గాన్ని రద్దు చేసి సర్పంచ్ ను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్ కు కలదు.

3) వరుసగా మూడు సార్లు గ్రామ సభల నిర్వహనలో విఫలమైతే సర్పంచ్ ని విధులనుండి తొలగిస్తారు

4) చట్టాన్ని ధిక్కరించినా,.ఆడిటింగ్ నిర్వహణలో విఫలమైనా , నిధులు దుర్వినియోగం చేసినా జిల్లా కలెక్టర్ - సర్పంచ్ ను తొలగిస్తారు

5) ఈవిధంగా తొలగించబడినవారు "ట్రిబ్యునల్" ను ఆశ్రయించవచ్చు , స్టే ఇచ్చే అధికారం ట్రిబ్యునల్ కు కలదు.

6) ప్రతి రెండు నెలలకొకసారి గ్రామ సభను నిర్వహించాలి , ఏడాదిలో ఒకసారైనా వ్రృద్దులు , మహిళలు , వికలాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి.

7) గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ప్రతి నెల "పాలకవర్గ" సమావేశం ఏర్పాటు చేయాలి.

8)  ప్రతి మూడు నెలలకొకసారి పంచాయతీ విస్తరణ అధికారి(ఈవోపిఆర్డీ) ప్రతి పంచాయతీని తనిఖీ చేయాలి. ప్రతి నెల 5 పంచాయతీల పర్యవేక్షణ, అభివృద్ధి కార్యక్రమాలపై విచారణ చేయాలి.

9) గ్రామ సభను పూర్తిగా వీడియో, ఫోటోలు తీసి సమర్పించాలి. ఈ సభకు అన్ని విభాగాల అధికారులు , సిబ్బంది హజరు కావాలి.

10) రాష్ట్ర బడ్జెట్లోనే నేరుగా నిధుల కేటాయింపు, 14వ ఆర్థిక సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఏక మొత్తంగా కేటాయింపు, జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామ పంచాయతీ కి కనీసం 5 లక్షల రూపాయలు ఏటా రాష్ట్ర బడ్జెట్ నుండే నేరుగా కేటాయింపు.

11) గ్రామ రోడ్లను పంచాయతీ రాజ్ శాఖ నిర్మాణం చేస్తుంది.

12) మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ నీటిని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుంది.