Tuesday, March 26, 2019

మార్చ్ 23 న, స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురు దేశం కోసం అమరులైన రోజున, రేమద్దుల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అమరవీరుల దినం జరుపుకోవడం జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా SI రాములు, భగత్ మరియు భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగినది.










మార్చ్ 23 న, సిపీఎం పార్టీ యువ నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పుష్పగుచ్ఛము వేసి జోహార్లు అర్పించారు.












Monday, March 25, 2019


అర్హతలు
2019 మార్చిలో 10 తరగతి పబ్లిక్పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు. ఇంటర్విభాగాలు ఎంపిసి, బైపిసి, ఎంఇసి, సిఇసి
కాలేజీలసంఖ్య
35, ఇందులో బాలురు-15, బాలికలు-20
ఫీజువివరాలు
రూ.150/-
ఎంపిక విధానం
ఆబ్జెక్టివ్ప్రవేశపరీక్ష ద్వారా, ప్రవేశ పరీక్షలో 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఎంపిసికి ఇంగ్లీష్‌, మాథ్స్‌, ఫిజికల్సైన్స్‌, బైపిసికి ఇంగ్లీష్‌, బయోసైన్స్‌, ఫిజికల్సైన్స్‌. సిఇసి, ఎంఇసి, గ్రూప్కు ఇంగ్లీష్‌, మాథ్స్‌, సోషల్స్టడీస్‌, అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రవేశపరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్కాలేజీల్లో చేరినవారికి అదనంగా కామన్ఎంట్రెన్స్‌, టెస్టులైన ఎంసెట్‌, నీట్ఐఐటి జెఇఇ కోచింగ్ఇస్తారు.
ప్రవేశపరీక్ష
10- మే-2019
దరఖాస్తులకు ఆఖరుతేదీ
11- ఏప్రిల్‌-2019
వెబ్‌సైట్‌

Friday, March 22, 2019

భారత బానిస సంకెళ్లు విడిపించేందుకు
బ్రిటీషర్ల ఉరికొయ్యలకు ఊపిరి వదిలిన
అమర వీరులకు జోహార్లు!
1). Bhagat Singh ( Died@23 years)
2). Sukhdev Thapar (Died @23 years)
3). Shivaram Rajguru (Died @22 years)



Saturday, March 9, 2019


విజయ్ ఆత్మకూరి S/O కోదండ రాములు, రేమద్దుల SSC -2001-2002 బ్యాచ్ , 'పరువు హత్యలెందుకు? ' అంటూ సమాజంలో పరువు హత్యలెందుకు జరుగుతున్నాయి అంటూ ప్రశ్నిస్తూ, అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల చిత్ర పటాలకు దండలు వేయడమే కాదు వారి ఆశయాలకు అణువుగా నడుచుకోవాలని ఆర్టికల్ రాశాడు.

ప్రస్తుతం విజయ్ ఆత్మకూరి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(TTWURJC (PTG-B))- మన్ననూర్ పనిచేస్తున్నాడు.

Thursday, March 7, 2019

రానున్న విద్య సంవత్సరానికి 2019-20 లో 5, 6, 7, 8వ తరగతులలో ప్రవేశానికి గాను రాష్ట్ర మైనారిటీ శాఖ అధికారులు  అర్హులైన విధ్యార్ధులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కావున మన ఊరి(రేమద్దుల) నుండి ఎవరైనా ఉంటె, ఈ అవకాశాన్ని వినియోగించు కుంటారని website లో పోస్ట్ చేయడం జరుగుతున్నది.

విద్యా సంవత్సరం : 2019-20

అర్హులు: మైనారిటి విద్యార్థులతో పాటు SC, ST, BC మరియు OC విద్యార్థులకు రిజర్వేషన్స్ ప్రకారం

దరఖాస్తు చివరి తేదీ: 31.03.2019

పరీక్ష తేదీ: 20-ఏప్రిల్-2019 -  5 వ తరగతి
                    22-ఏప్రిల్-2019 -  6వ, 7వ, 8వ  తరగతులు

ఎక్కడ అప్లై చెయ్యాలి: http://tmreis.telangana.gov.in/

Credits to
www.epaper.eenadu.net.

మన ఉరిలో(రేమద్దుల) రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించబడ్డాయి. మన ఊరి సర్పంచ్ మంజుల తిరుపతయ్య ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాలనుండి 11 ఎద్దుల జతలు పోటీలో పాల్గొన్నాయి. 

జరిగిన రోజు : 05.03.2019

గెలిచిన  వారి వివరాలు
మొదటి స్థానం : చక్రవర్తి గౌడ్ ఎద్దులు - శనగపల్లి, ఇటిక్యాల 
రెండవ స్థానం: వీరేష్ గౌడ్ - ఇందువాసి, గట్టు 
మూడవ స్థానం : వెంకటేశ్వరరావు - చంద్రకల్ , పెద్దకొత్తపల్లి 
నాల్గవ స్థానం : లింగాల స్వామి - అంబటి పల్లి 
అయిదవ స్థానం: రామచంద్ర రెడ్డి - రాయవరం 

ఫొటోలు








వీడియోలు 





వార్తా క్లిప్పింగ్స్ 





Monday, March 4, 2019

May Lord Shiva give power and strength to everyone facing difficulties.
Wishing you and your family Maha Shivaratri.


Friday, March 1, 2019


గోపాల శివ S/O గోపాల మల్లయ్య , రేమద్దుల SSC -2005-2006 బ్యాచ్ , 'అభినవ శూరుడా ' అంటూ పాకిస్తాన్ అదుపులో ఉండి ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ను తలుచుకుంటూ రాసిన కవిత.

All the best Shiva. ముందు ముందు ఇంకా పైకి ఎదగాలని మరియు మంచి కవితలు రాయాలని ఆశిస్తున్నాము.

ప్రస్తుతం గోపాల శివ 99 టీవి హైదరాబాద్ హెడ్ ఆఫీసులో వీడియో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
అభినవ శూరుడా !

వీరుడా అభినవ శూరుడా..
తోడేళ్ళ మందకు ఆహారం
అవుతున్నావని తెలిసినా
అదరక బెదరక తలవంచక
సింహమై గర్జించిన నీ ధీరత్వానికి
యావత్ భారతం సలాం కొడుతోంది..
రాబందుల రాజ్యంలో
ఆ రాకాసుల చేతుల్లో
ముఖమంతా రుధిరంతో
బతుకును పణంగా పెట్టి
జైహింద్ అన్న నీ పరాక్రమానికి
అశేతు హిమాచలం
మంచు వర్షం కురిపిస్తోంది

భారతమ్మ బిడ్డల నుదుట
సింధూరాన్ని తుడిపేసిన
విషనాగుల చెరలో నీవున్నా

మొక్కవోని ధైర్య సాహసంతో
సవాల్ విసిరిన నీ పరాక్రమం
120 కోట్ల అభిమానుల
గుండె చప్పుడై మారుమోగుతోంది.

సింహం ఎక్కడున్నా సింహమేరా
ఈ కళ్ళల్లో మండుతున్న అగ్ని ధాటికి
మీ అరాచక శక్తులు బూడిద కాక తప్పదురా..

శత్రువులకు దడపుట్టించి
మాతృభూమికి తిరిగివస్తున్న
వీరుడా వందనం..
ధీరుడా అభివందనం...🙏
జై హింద్ జై జవాన్ జై జై జవాన్

Wednesday, February 27, 2019

ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా తీసిన ఫోటోలు.

స్వయం పరిపాలన దినోత్సవం జరిగిన రోజు : 26.02.2019





Monday, February 25, 2019

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని ఉట్కూరి మండలం, బిజ్వార్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి నిరూపించాడు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికెషన్స్కు అప్లై చేసుకొని ప్రణాళిక ప్రకారం చదివి ఒకేసారి అయిదు ఉద్యోగాలకు ఎంపికైనాడు.

ప్రేరణకు ప్రతి ఒక్కరికి అబ్దుల్ కలాం జీవితమే కావలిసిన అవసరం లేదు. మీ చుట్టు పక్కల కూడా ఎన్నో ప్రేరణాత్మక కథలు ఉంటాయి.

మన ఊరినుండి కూడా ఇలాంటి ప్రేరేపింప దగిన కథలు ఉంటె, remaddula.info@gmail.com లేదా 7995391030 కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు


CREDITS to: www.epaper.eenadu.net



Thursday, February 21, 2019

స్వచ్ఛ రేమద్దుల!               స్వచ్ఛ భారత్!!











మన గ్రామంలో మురికి నీరు రోడ్ల పై పారుతుంది అదేవిదంగా చెత్త చెదారం రోడ్లపై గ్రామ ప్రజలు వేస్తున్నారు కాబట్టి ఆలా వేయడం వలన మన ప్రజలే ఆనారోగ్య పాలై అవకాశం ఉంది కాబట్టి ప్రజల దృష్టికి తీసుకపోదాం అందుకోసం మనం అందరం ఆదివారం రోజు డ్రైనేజీ ల మట్టి ఎత్తడం ప్రోగ్రాం పెట్టుకుందాం కాబట్టి అందరు తప్పకుండా పాల్గొనగలరు మన ఊరి శుభ్రతకు యువత ముందుకు రావాలి.

సర్పంచ్ మంజుల తిరుపతయ్య 

ఉపసర్పంచ్ గంధం రాంబాబు

Tuesday, February 19, 2019


PM-KISAN Scheme
చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-KISAN)’ పథకం పెట్టి 2019 నుండి నగదు సహాయం చేయాలని నిర్ణయించింది. PM-KISAN పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

పథకం ఎవరికీ వర్తిస్తుంది?
ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఐదెకరాల లోపు భూమిని వివిధ చోట్ల ఉండి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటున్నా వారికి కూడా అందజేస్తారు.

పతకం క్రింద ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?
ఏటా మూడు విడతలు రెండు వేల రూపాయల వంతున సంవత్సరానికి 6000 రూ. ఆర్థిక సహాయం అందుతుంది.

ఆర్థిక సహాయం ఎప్పుడు చేస్తారు?
మొదటి విడత కాలం 1.12.2018 to 31.03.2019 కి గాను  24.02.2019 రోజు బ్యాంకు అకౌంట్ లో 2000 రూ. వేస్తారు.
మొదటి విడతకు చివరి తేదీ: 20.02.2019

పథకం ఎవరికి వర్తించదు?
క్రింద ఇచ్చిన అధిక ఆర్థిక స్థితి వర్గాలకు ఈ పథకం వర్తించదు
  1. ఉన్నతాదాయవర్గాల వారు
  2. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థల కింద ఐదెకరాల లోపు భూమి ఉన్నవారు
  3. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వర్తించదు
  4. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ తాజా, మాజీ చైర్మన్లు
  5. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు. నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపు.
  6. రూ.10వేల మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులు, గతేడాది ఐటీ చెల్లించినవారు.
లబ్దిదారులను ఎలా  గుర్తిస్తారు?
  1. రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఉన్న అర్హత గల లబ్ధిదారుల కుటుంబాలను గుర్తించాలి.  లబ్ధిదారుల డాటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం పేరు, వయస్సు, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఆధార్, సెల్‌నంబర్లు కూడా పంపాలి.
  2. లబ్ధిదారులే సొంత ధ్రువీకరణ ఇవ్వాలి. తప్పుడు సమాచారమిస్తే సొమ్ము వాపస్ తీసుకోవటంతోపాటు చట్టపర చర్యలు.
  3. రాష్ట్రాలు లబ్దిదారులను గుర్తించడానికి ముందున్న భూ-యాజమాన్య వ్యవస్థని ఉపయోగించుకోవాలి.  వాటిని ఆధార్ తో అనుసంధానం చేయాలి  మరియు భూమి రికార్డులను డిజిటైజషన్ చేయాలి. 
  4. అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలు గ్రామ పంచాయితీలో ప్రచురించాలి. 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరియు రైతు బంధు రెండు ఒకటి కాదు.

Website
https://pmkisan.nic.in/Home.aspx

PM-KISAN - OPERATIONAL GUIDELINES




PM-KISAN గురుంచి ఈనాడు పేపర్లో (19.02.2019)

CREDITS to: www.epaper.eenadu.net



Monday, February 18, 2019

రేమద్దుల గ్రామ ఉన్నత పాఠశాలలో 16.02.2019 ( శనివారము ) రోజు, "ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(PMGDISHA)" పథకం క్రింద డిజిటల్ అక్షరాస్యతను కల్పించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగినవి. దీనిని "డిజిటల్ ఇండియా ప్రోగ్రాము"లో భాగంగా చేపట్టనున్నారు.

దీనిలో భాగంగా రేమద్దుల గ్రామంకు చెంది డిగ్రీ చేసిన ఒక 10 మంది నిరుద్యోగ యువతకు డిజిటల్ ట్రైనింగ్ ఇప్పించి తద్వార వారిని విద్య వాలంటీర్స్ గా తీసుకొని హై స్కూల్లో ని 8 వ, 9 వ మరియు 10 వ తరగతి విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించాలని సర్పంచ్ అనుకుంటున్నారు.